+91 94404 78787 · andhrabiblecollege@gmail.com · Mon–Fri, 9 am–5 pm IST eCampus loginOrientationSTARR Library catalogueGive
Andhra Bible College seal Andhra Bible College
ఆంధ్రా బైబిల్ కళాశాల

Online students · ఆన్‌లైన్ విద్యార్థులు

Orientation for Online Students


Everything you need before your first Module: how a Module works, your eCampus, grades, participation, academic honesty, spiritual formation, fees and who to contact. In English and Telugu.

Orientation booklet cover

Booklet · బుక్‌లెట్

Read the orientation booklet

32 pages, English on the left and Telugu on the right. Flip through it online or download the PDF.

01Welcome

స్వాగతం

Welcome to Andhra Bible College

Dear student,

Welcome to the ABC family. Theological education is a journey of faith and service, and we are glad to walk it with you. You will study from home, alongside your work, family and church. You will study the same courses, to the same standard, as our students in Eluru. Since 1987 the Lord has used this college to train servant-leaders, and today our online students study from India and from countries as far as the US, UK, Canada and the Gulf.

Give your best to every Module, stay close to the Lord and to your local church, and ask us whenever you need help.

Pas. John Prabhu Kiran Vunnamatla, Executive Director

Vision: To glorify God in training anointed and informed servant leaders.

Mission: To develop church planters and Christian leaders who glorify God by obeying the Great Commission to reach the unreached.

Core values: Obedience: faithful to the Word of God · Humility: a teachable heart · Service: Christ-like leadership.

"All Scripture is breathed out by God… that the man of God may be complete, equipped for every good work." 2 Timothy 3:16–17 (ESV)

ఆంధ్ర బైబిల్ కళాశాలకు స్వాగతం

ప్రియమైన విద్యార్థీ,

ABC కుటుంబంలోకి మీకు స్వాగతం. వేదాంత విద్య విశ్వాసం మరియు సేవతో కూడిన ఒక ప్రయాణం; ఈ ప్రయాణంలో మీతో కలిసి నడవడం మాకు ఆనందం. మీ ఉద్యోగం, కుటుంబం, సంఘంతో పాటు ఇంటి నుండే మీరు చదువుతారు. ఏలూరులోని మా విద్యార్థులు చదివే కోర్సులనే, అదే ప్రమాణంతో మీరూ చదువుతారు. 1987 నుండి దేవుడు ఈ కళాశాలను సేవా నాయకులను సిద్ధపరచడానికి వాడుకుంటున్నాడు. ఈ రోజు మా ఆన్‌లైన్ విద్యార్థులు భారతదేశం నుండే కాక అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, గల్ఫ్ దేశాల నుండి కూడా చదువుతున్నారు.

ప్రతి మాడ్యూల్‌లో మీ శ్రేష్ఠమైనది ఇవ్వండి, ప్రభువుకు మరియు మీ స్థానిక సంఘానికి దగ్గరగా ఉండండి, సహాయం కావలసినప్పుడల్లా మమ్మల్ని అడగండి.

పా. జాన్ ప్రభు కిరణ్ వున్నమట్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

దర్శనం: అభిషిక్తులైన, జ్ఞానవంతులైన సేవా నాయకులను సిద్ధపరచడం ద్వారా దేవుణ్ణి మహిమపరచడం.

లక్ష్యం: చేరని వారిని చేరుకోవడానికి గొప్ప ఆజ్ఞకు లోబడుతూ దేవుణ్ణి మహిమపరచే సంఘ స్థాపకులను, క్రైస్తవ నాయకులను సిద్ధపరచడం.

మూల విలువలు: విధేయత: దేవుని వాక్యానికి నమ్మకంగా · వినయం: నేర్చుకునే హృదయం · సేవ: క్రీస్తు వంటి నాయకత్వం.

"దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము … ప్రయోజనకరమై యున్నది." 2 తిమోతి 3:16–17

02What we believe

మా విశ్వాసం

ABC holds a biblical, evangelical faith. In short, we believe in:

  • the full authority of Scripture, the 66 books of the Bible, inspired by God;
  • one God in three persons: Father, Son and Holy Spirit;
  • the full deity and full humanity of Jesus Christ in one Person, His virgin birth, sinless life, death for our sins, bodily resurrection and return;
  • salvation by grace through faith in Christ alone (John 14:6; Acts 4:12);
  • the local church, believer's baptism and the Lord's Supper;
  • the Great Commission: evangelism and church planting.

The full Statement of Faith is in the College Catalog, and every student signs it at registration.

ABC బైబిల్ ఆధారిత, సువార్తిక విశ్వాసాన్ని కలిగి ఉంది. సంక్షిప్తంగా మేము నమ్మేవి:

  • లేఖనముల సంపూర్ణ అధికారం: దేవుని ప్రేరణతో వచ్చిన బైబిల్ 66 పుస్తకాలు;
  • తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులలో ఉన్న ఒకే దేవుడు;
  • యేసుక్రీస్తు ఒకే వ్యక్తిలో సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు; ఆయన కన్యక జననం, పాపరహిత జీవితం, మన పాపముల కొరకు మరణం, శారీరక పునరుత్థానం, తిరిగి రాకడ;
  • క్రీస్తు నందు మాత్రమే విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ (యోహాను 14:6; అపొ.కా. 4:12);
  • స్థానిక సంఘం, విశ్వాసుల బాప్తిస్మం మరియు ప్రభువు రాత్రి భోజనం;
  • గొప్ప ఆజ్ఞ: సువార్త ప్రకటన మరియు సంఘ స్థాపన.

పూర్తి విశ్వాస ప్రకటన కళాశాల క్యాటలాగ్‌లో ఉంది; ప్రతి విద్యార్థి రిజిస్ట్రేషన్ సమయంలో దానిపై సంతకం చేస్తారు.

03Your journey

మీ ప్రయాణం

  1. Apply online. There's no application fee.
  2. A call from our office on WhatsApp.
  3. Pay the admission fee once the Principal approves.
  4. Register: upload your photo, certificates (clear scans), ID and your pastor's letter. The office may ask to see originals later.
  5. Your eCampus login arrives by email, and you join your batch's WhatsApp group.
  6. Start your first Module with your batch (January or June).
  7. One Module a month: Dip.Th 20 Modules (2 years), B.Th 30 (3 years), M.Div 30 (2–3 years).
  8. Graduate. Every credit can be earned online. Online graduates are warmly invited to the graduation ceremony in Eluru, and may also graduate in absentia.
  1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి: దరఖాస్తుకు ఫీజు లేదు.
  2. వాట్సాప్‌లో మా ఆఫీసు నుండి ఒక కాల్.
  3. ప్రిన్సిపల్ ఆమోదం తర్వాత అడ్మిషన్ ఫీజు చెల్లించండి.
  4. రిజిస్టర్ చేసుకోండి: మీ ఫోటో, సర్టిఫికెట్లు (స్పష్టమైన స్కాన్‌లు), ID, మీ పాస్టర్ గారి లేఖ అప్‌లోడ్ చేయండి. తర్వాత అసలు సర్టిఫికెట్లు చూపించమని ఆఫీసు అడగవచ్చు.
  5. మీ eCampus లాగిన్ ఈమెయిల్‌కు వస్తుంది, మీ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్‌లో చేరుతారు.
  6. మీ బ్యాచ్‌తో (జనవరి లేదా జూన్) మొదటి మాడ్యూల్ ప్రారంభించండి.
  7. నెలకు ఒక మాడ్యూల్: Dip.Th 20 మాడ్యూల్స్ (2 సంవత్సరాలు), B.Th 30 (3 సంవత్సరాలు), M.Div 30 (2–3 సంవత్సరాలు).
  8. గ్రాడ్యుయేట్ అవ్వండి: అన్ని క్రెడిట్లను ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. ఏలూరులో జరిగే గ్రాడ్యుయేషన్ వేడుకకు ఆన్‌లైన్ గ్రాడ్యుయేట్లకు హృదయపూర్వక ఆహ్వానం; రాలేకపోయినా డిగ్రీ పొందవచ్చు (ఇన్ ఆబ్సెన్షియా).

04How a Module works

మాడ్యూల్ ఎలా జరుగుతుంది

Each Module is one course: 15 lessons in 4 weeks, with the same content and standard as on campus.

  • Monday to Thursday, lessons: one lesson a day: watch the recorded lecture, do the reading, and write a short Reading Response. Lessons unlock in order.
  • Friday, Reading Report: gather the week's responses into the Reading Report form.
  • Saturday and Sunday, quizzes and exams: timed and typed into the eCampus. They open when you finish the lessons, and close on Sunday night.
  • Research paper: a short proposal in Week 2 and the final paper in Week 4 (Dip.Th 3–5 pages, B.Th 8–12, M.Div 15–20).

There are no live class times: study when it suits you, but keep the weekly deadlines. Set aside regular time every day.

Materials are in English. You may write your assignments and exams in English or Telugu.

ప్రతి మాడ్యూల్ ఒక కోర్సు: 4 వారాల్లో 15 పాఠాలు, క్యాంపస్‌లో ఉన్న అదే విషయం, అదే ప్రమాణం.

  • సోమవారం నుండి గురువారం, పాఠాలు: రోజుకు ఒక పాఠం: రికార్డ్ చేసిన క్లాసు చూసి, చదివి, ఒక చిన్న రీడింగ్ రెస్పాన్స్ రాయండి. పాఠాలు వరుసగా తెరుచుకుంటాయి.
  • శుక్రవారం, రీడింగ్ రిపోర్ట్: ఆ వారం రెస్పాన్స్‌లను రీడింగ్ రిపోర్ట్ ఫారంలో సమర్పించండి.
  • శనివారం, ఆదివారం, క్విజ్‌లు, పరీక్షలు: సమయ పరిమితితో, eCampus లో టైప్ చేయాలి. పాఠాలు పూర్తి చేసిన తర్వాత తెరుచుకుంటాయి; ఆదివారం రాత్రికి ముగుస్తాయి.
  • రీసెర్చ్ పేపర్: 2వ వారంలో చిన్న ప్రతిపాదన, 4వ వారంలో పూర్తి పేపర్ (Dip.Th 3–5 పేజీలు, B.Th 8–12, M.Div 15–20).

లైవ్ క్లాస్ టైమింగ్స్ లేవు: మీకు వీలైనప్పుడు చదవండి, కానీ వారపు గడువులు పాటించండి. ప్రతిరోజూ క్రమంగా సమయం కేటాయించండి.

పాఠ్యాంశాలు ఇంగ్లీష్‌లో ఉంటాయి. అసైన్‌మెంట్లు, పరీక్షలు ఇంగ్లీష్ లేదా తెలుగులో రాయవచ్చు.

05Your eCampus

మీ eCampus

abcelr.moodlecloud.com

  • Logging in: use the username and password emailed to you. Forgot your password? Tap "Forgotten your username or password?" on the login page, or message the office.
  • On a phone: the eCampus works in your phone's browser.
  • Inside a Module: the course page shows the lessons in order, readings, forms, quizzes and exams.
  • Questions about a course: post them in the Module's Q&A forum. Answers come within 2 working days.
  • Technical trouble: tell your professor before the deadline closes, with a screenshot if you can.

abcelr.moodlecloud.com

  • లాగిన్: మీ ఈమెయిల్‌కు పంపిన యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వాడండి. పాస్‌వర్డ్ మర్చిపోతే లాగిన్ పేజీలో "Forgotten your username or password?" నొక్కండి, లేదా ఆఫీసుకు మెసేజ్ చేయండి.
  • ఫోన్‌లో: మీ ఫోన్ బ్రౌజర్‌లో eCampus పనిచేస్తుంది.
  • మాడ్యూల్ లోపల: కోర్సు పేజీలో పాఠాలు వరుసగా, పాఠ్యాంశాలు, ఫారాలు, క్విజ్‌లు, పరీక్షలు ఉంటాయి.
  • కోర్సు సందేహాలు: మాడ్యూల్ Q&A ఫోరమ్‌లో అడగండి. రెండు పని దినాల్లో జవాబు వస్తుంది.
  • సాంకేతిక సమస్యలు: గడువు ముగిసేలోపే మీ ప్రొఫెసర్‌కు తెలియజేయండి, వీలైతే స్క్రీన్‌షాట్‌తో.

06Assignments, exams and grades

అసైన్‌మెంట్లు, పరీక్షలు, గ్రేడ్‌లు

Each Module's syllabus on the eCampus lists its assignments, quizzes, mid-term, final and their weights. Graded work comes back within two weeks.

Grades (10-point scale): O 90–100 · A+ 80–89 · A 70–79 · B+ 60–69 · B 55–59 · C 50–54 · P 40–49 · F below 40.

Pass mark: Dip.Th and B.Th P (40%). M.Div C (50%). You must pass the final exam and reach the pass mark overall.

CGPA = sum of (grade point × credits) ÷ total credits. Graduation needs CGPA 4.0 (Dip.Th, B.Th) or 5.0 (M.Div).

Resit: one resit per course. The highest grade after a resit is P (Dip.Th, B.Th) or C (M.Div).

Incomplete: only with the Academic Dean's written approval, and finished within 4 weeks.

ప్రతి మాడ్యూల్ సిలబస్ (eCampus లో) దాని అసైన్‌మెంట్లు, క్విజ్‌లు, మిడ్-టర్మ్, ఫైనల్, వాటి వెయిటేజ్‌ను తెలుపుతుంది. దిద్దిన పనులు రెండు వారాల్లో తిరిగి వస్తాయి.

గ్రేడ్‌లు (10-పాయింట్ స్కేల్): O 90–100 · A+ 80–89 · A 70–79 · B+ 60–69 · B 55–59 · C 50–54 · P 40–49 · F 40 లోపు.

పాస్ మార్క్: Dip.Th, B.Th కు P (40%). M.Div కు C (50%). ఫైనల్ పరీక్షలో పాస్ అవ్వాలి మరియు మొత్తం సగటులో పాస్ మార్క్ రావాలి.

CGPA = (గ్రేడ్ పాయింట్ × క్రెడిట్స్) మొత్తం ÷ మొత్తం క్రెడిట్స్. గ్రాడ్యుయేషన్‌కు CGPA 4.0 (Dip.Th, B.Th) లేదా 5.0 (M.Div) కావాలి.

రీసిట్: ఒక్కో కోర్సుకు ఒక రీసిట్. రీసిట్ తర్వాత గరిష్ఠ గ్రేడ్ P (Dip.Th, B.Th) లేదా C (M.Div).

ఇన్‌కంప్లీట్: అకడమిక్ డీన్ రాతపూర్వక అనుమతితో మాత్రమే; 4 వారాల్లో పూర్తి చేయాలి.

07Participation and deadlines

పాల్గొనడం మరియు గడువులు

  • 85% participation is required in every Module. The eCampus records your activity: lessons, responses, reports, quizzes. Below 85% you may be barred from the final exam.
  • Late work loses 5% a day. Work more than 7 days late gets no marks.
  • Emergencies (illness, family, ministry): write to the Academic Dean before the deadline.
  • Missed a whole month? You can take that Module later and carry on.
  • ప్రతి మాడ్యూల్‌లో 85% పాల్గొనడం తప్పనిసరి. eCampus మీ పనిని నమోదు చేస్తుంది: పాఠాలు, రెస్పాన్స్‌లు, రిపోర్టులు, క్విజ్‌లు. 85% కంటే తక్కువైతే ఫైనల్ పరీక్షకు అనుమతి ఉండకపోవచ్చు.
  • ఆలస్యమైన పనికి రోజుకు 5% తగ్గుతుంది. 7 రోజుల కంటే ఆలస్యమైతే మార్కులు రావు.
  • అత్యవసర పరిస్థితుల్లో (అనారోగ్యం, కుటుంబం, పరిచర్య): గడువుకు ముందే అకడమిక్ డీన్‌కు రాయండి.
  • ఒక నెల మొత్తం మిస్ అయితే? ఆ మాడ్యూల్‌ను తర్వాత చేసి కొనసాగించవచ్చు.

08Academic honesty

విద్యా నిజాయితీ

Your work must be your own.

  • Plagiarism means copying without citing, using another student's work, paraphrasing without credit, or handing in AI-written work.
  • No AI tools or search-engine answers may be used to write any assessed work.
  • Cite your sources: Dip.Th: name your sources · B.Th: MLA (9th ed.) · M.Div: Turabian (9th ed.).
  • Consequences: 1st time: written warning and resubmission within 5 days. 2nd time: F for the course and academic probation. 3rd time: Academic Disciplinary Committee.
  • Respect: represent every thinker and tradition fairly, "with gentleness and respect" (1 Peter 3:15).

మీ పని మీదే అయి ఉండాలి.

  • కాపీ (ప్లేజియరిజం) అంటే: ఆధారం చెప్పకుండా కాపీ చేయడం, మరొక విద్యార్థి పనిని వాడటం, ఆధారం చెప్పకుండా మాటలు మార్చి రాయడం, AI రాసిన పనిని సమర్పించడం.
  • మూల్యాంకనం చేసే ఏ పనినీ రాయడానికి AI టూల్స్ గానీ, సెర్చ్ ఇంజన్ సమాధానాలు గానీ వాడకూడదు.
  • మీ ఆధారాలను పేర్కొనండి: Dip.Th: ఆధారాల పేర్లు · B.Th: MLA (9వ ఎడిషన్) · M.Div: Turabian (9వ ఎడిషన్).
  • పరిణామాలు: మొదటిసారి: రాతపూర్వక హెచ్చరిక, 5 రోజుల్లో మళ్ళీ సమర్పించాలి. రెండవసారి: ఆ కోర్సుకు F, అకడమిక్ ప్రొబేషన్. మూడవసారి: అకడమిక్ క్రమశిక్షణ కమిటీ.
  • గౌరవం: ప్రతి ఆలోచనాపరుడినీ, ప్రతి సంప్రదాయాన్నీ న్యాయంగా, "సాత్వికముతోను భయముతోను" తెలియజేయండి (1 పేతురు 3:15).

09Spiritual formation and ministry

ఆత్మీయ ఎదుగుదల మరియు పరిచర్య

ABC trains the whole person: heart, mind and hands.

  • Daily devotions: read the Bible and pray every day. You can send prayer requests to the college office.
  • Your pastor as mentor: the pastor who wrote your letter walks with you as your local mentor.
  • Serve in your local church: your practicum credits are earned through ministry in your own church, confirmed by your pastor (Dip.Th 8 credits, B.Th 12, M.Div 6).
  • Online chapel and prayer meeting: the day, time and link are shared in your batch WhatsApp group.

ABC సంపూర్ణ వ్యక్తికి శిక్షణ ఇస్తుంది: హృదయం, మనస్సు, చేతులు.

  • ప్రతిదిన ధ్యానం: ప్రతిరోజూ బైబిల్ చదివి ప్రార్థించండి. మీ ప్రార్థనా విన్నపాలను కళాశాల ఆఫీసుకు పంపవచ్చు.
  • మెంటార్‌గా మీ పాస్టర్: మీ లేఖ రాసిన పాస్టర్ గారు మీ స్థానిక మెంటార్‌గా మీతో నడుస్తారు.
  • మీ స్థానిక సంఘంలో సేవ: మీ ప్రాక్టికమ్ క్రెడిట్లు మీ సొంత సంఘంలో చేసే పరిచర్య ద్వారా వస్తాయి, మీ పాస్టర్ గారు ధృవీకరిస్తారు (Dip.Th 8 క్రెడిట్లు, B.Th 12, M.Div 6).
  • ఆన్‌లైన్ చాపెల్, ప్రార్థనా కూడిక: రోజు, సమయం, లింక్ మీ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్‌లో తెలియజేస్తాము.

10Staying connected

సంబంధంలో ఉండండి

You will join your batch's WhatsApp group.

  • Use it for college announcements and Module reminders. Course questions go to the eCampus Q&A forum.
  • Be kind and respectful. Address staff as Pastor or Prof.
  • No forwards, advertisements, politics or unrelated videos.
  • Message the office during office hours: Monday to Friday, 9 am to 5 pm. Replies may take until the next working day.
  • Photos or recordings of college sessions may be used in college publications.

మీరు మీ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్‌లో చేరుతారు.

  • కళాశాల ప్రకటనలు, మాడ్యూల్ రిమైండర్ల కోసం దీన్ని వాడండి. కోర్సు సందేహాలు eCampus Q&A ఫోరమ్‌లో అడగండి.
  • దయగా, గౌరవంగా ఉండండి. సిబ్బందిని పాస్టర్ గారు లేదా ప్రొఫెసర్ గారు అని సంబోధించండి.
  • ఫార్వర్డ్‌లు, ప్రకటనలు, రాజకీయాలు, సంబంధం లేని వీడియోలు వద్దు.
  • ఆఫీసు సమయంలో మెసేజ్ చేయండి: సోమవారం–శుక్రవారం, ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు. జవాబు తర్వాతి పని దినానికి రావచ్చు.
  • కళాశాల కార్యక్రమాల ఫోటోలు, రికార్డింగ్‌లు కళాశాల ప్రచురణల్లో వాడవచ్చు.

11Fees and payments (2026–27)

ఫీజులు మరియు చెల్లింపులు (2026–27)

Dip.Th / B.ThM.Div
Admission (one-time)₹2,000₹2,500
Module fee (per month)₹1,500₹2,000
Digital library (per year)₹1,000₹1,000
  • No application fee.
  • Admission fee: pay by UPI to andhrabiblecollege1@cnrb (Scan & Pay QR), then send the screenshot on WhatsApp.
  • Module fee: pay through the Vedmarg app by the 10th of each month.
  • Fees are not refundable. If you miss a month, you can take that Module later.
  • Grade reports and certificates are issued when all fees are paid.
UPI QR code for andhrabiblecollege1@cnrbUPI: andhrabiblecollege1@cnrb
Dip.Th / B.ThM.Div
అడ్మిషన్ (ఒకేసారి)₹2,000₹2,500
మాడ్యూల్ ఫీజు (నెలకు)₹1,500₹2,000
డిజిటల్ లైబ్రరీ (సంవత్సరానికి)₹1,000₹1,000
  • దరఖాస్తుకు ఫీజు లేదు.
  • అడ్మిషన్ ఫీజు: andhrabiblecollege1@cnrb కు UPI ద్వారా చెల్లించి (స్కాన్ & పే QR), స్క్రీన్‌షాట్ వాట్సాప్‌లో పంపండి.
  • మాడ్యూల్ ఫీజు: Vedmarg యాప్ ద్వారా ప్రతి నెల 10వ తేదీలోపు చెల్లించండి.
  • ఫీజులు తిరిగి ఇవ్వబడవు. ఒక నెల మిస్ అయితే, ఆ మాడ్యూల్‌ను తర్వాత చేయవచ్చు.
  • అన్ని ఫీజులు చెల్లించిన తర్వాతే గ్రేడ్ రిపోర్టులు, సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి.

12Library

లైబ్రరీ

  • STARR Library: about 37,000 books in Eluru, with an online catalogue on our website.
  • Digital library: your yearly library fee gives access to digital theological resources.
  • Readings: each Module lists its textbooks and readings on the eCampus. Use the ESV and the Telugu OV Bible.
  • Librarian: Ms. Sangeetha Twinkle.
  • STARR లైబ్రరీ: ఏలూరులో సుమారు 37,000 పుస్తకాలు; మా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ క్యాటలాగ్ ఉంది.
  • డిజిటల్ లైబ్రరీ: మీ వార్షిక లైబ్రరీ ఫీజుతో డిజిటల్ వేదాంత వనరులు అందుబాటులో ఉంటాయి.
  • పాఠ్యాంశాలు: ప్రతి మాడ్యూల్ పుస్తకాలు, పాఠ్యాంశాలు eCampus లో ఉంటాయి. ESV మరియు తెలుగు OV బైబిల్ వాడండి.
  • లైబ్రేరియన్: సంగీత ట్వింకిల్ గారు.

13Key dates

ముఖ్యమైన తేదీలు

  • Batches start twice a year: January and June.
  • Each Module: 4 weeks. Module fees are due by the 10th.
  • College holidays: Christmas, New Year, Good Friday and Easter.
  • Graduation: the ceremony is held in Eluru in the 4th week of March.
  • Dates for your batch are announced in your WhatsApp group and on the eCampus.
  • బ్యాచ్‌లు సంవత్సరానికి రెండుసార్లు: జనవరి మరియు జూన్.
  • ప్రతి మాడ్యూల్: 4 వారాలు. మాడ్యూల్ ఫీజు 10వ తేదీలోపు.
  • కళాశాల సెలవులు: క్రిస్మస్, నూతన సంవత్సరం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్.
  • గ్రాడ్యుయేషన్: వేడుక ఏలూరులో మార్చి 4వ వారంలో జరుగుతుంది.
  • మీ బ్యాచ్ తేదీలు వాట్సాప్ గ్రూప్‌లో, eCampus లో తెలియజేస్తాము.

14Who to contact

ఎవరిని సంప్రదించాలి

  • Admissions and general: the office, 94404 78787 · 63009 34773 · andhrabiblecollege@gmail.com
  • Courses, deadlines, incompletes: Pas. Job Das Teetla, Academic Dean
  • Registration, records, appeals: Mrs. M. Anandamai Medepalli, Principal and Registrar
  • Fees: Mr. Munesh Kanchumarthi, Finance
  • Library: Ms. Sangeetha Twinkle, Librarian
  • Grievances: Pas. John Prabhu Kiran Vunnamatla, Executive Director

Office hours: Monday to Friday, 9 am to 5 pm IST · 5-3C, IBM Campus, Vanguru Road, Eluru 534475 · www.andhrabiblecollege.in

  • అడ్మిషన్లు, సాధారణ విషయాలు: ఆఫీసు, 94404 78787 · 63009 34773 · andhrabiblecollege@gmail.com
  • కోర్సులు, గడువులు, ఇన్‌కంప్లీట్: పా. జాబ్ దాస్ తీట్ల, అకడమిక్ డీన్
  • రిజిస్ట్రేషన్, రికార్డులు, అప్పీళ్లు: శ్రీమతి ఎం. ఆనందమయి మేడేపల్లి, ప్రిన్సిపల్ మరియు రిజిస్ట్రార్
  • ఫీజులు: శ్రీ మునేష్ కంచుమర్తి, ఫైనాన్స్
  • లైబ్రరీ: సంగీత ట్వింకిల్ గారు, లైబ్రేరియన్
  • ఫిర్యాదులు: పా. జాన్ ప్రభు కిరణ్ వున్నమట్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఆఫీసు సమయం: సోమవారం–శుక్రవారం, ఉదయం 9 – సాయంత్రం 5 (IST) · 5-3C, IBM క్యాంపస్, వంగూరు రోడ్, ఏలూరు 534475 · www.andhrabiblecollege.in

15Your first-week checklist

మొదటి వారం చెక్‌లిస్ట్

  • Log in to the eCampus and change your password
  • Join your batch WhatsApp group
  • Pay the Module fee on the Vedmarg app by the 10th
  • Read the Module syllabus and note the weekly deadlines
  • Get your textbooks and Bibles (ESV and Telugu OV) ready
  • Plan a regular daily study time
  • Tell your pastor you have started, and agree how you'll meet
  • Post a hello in the Module's Q&A forum
  • eCampus లో లాగిన్ అయి పాస్‌వర్డ్ మార్చుకోండి
  • మీ బ్యాచ్ వాట్సాప్ గ్రూప్‌లో చేరండి
  • 10వ తేదీలోపు Vedmarg యాప్‌లో మాడ్యూల్ ఫీజు చెల్లించండి
  • మాడ్యూల్ సిలబస్ చదివి వారపు గడువులు గుర్తు పెట్టుకోండి
  • మీ పుస్తకాలు, బైబిళ్లు (ESV మరియు తెలుగు OV) సిద్ధం చేసుకోండి
  • ప్రతిరోజూ చదివే సమయాన్ని నిర్ణయించుకోండి
  • మీరు చదువు ప్రారంభించారని మీ పాస్టర్ గారికి చెప్పి, ఎలా కలుసుకోవాలో నిర్ణయించుకోండి
  • మాడ్యూల్ Q&A ఫోరమ్‌లో "హలో" అని పోస్ట్ చేయండి
Apply nowPrograms